రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సమయంలో ఆర్టీసీ బస్సులకు సడలింపు ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం పటాన్చెరు బస్టాండ్‌కు సంగారెడ్డి డిపో బస్సులు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న డిపోలకు సడలింపు ఇవ్వకపోవడం వల్ల స్థానికంగా ఉన్న బీహెచ్ఈఎల్ డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటికి విడిచి పెట్టలేదని ఆర్టీసీ డీఎం సత్యనారాయణ తెలిపారు. పటాన్చెరు బస్టాండ్‌కు బస్సులు వచ్చినప్పటికీ పదిమంది లోపు ప్రయాణికులు మాత్రమే కనిపిస్తున్నారు. ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెలబోతోంది.
ఉన్న ప్రయాణికులు ఒకరిద్దరితో ఆర్టీసీ బస్సులను సిబ్బంది తిప్పుతున్నారు. కేవలం కరోనా కట్టడి నేపథ్యంలో వైద్యసిబ్బంది కోసం, వలస కార్మికుల కోసం బస్సులు తిరుగుతున్నాయి తప్ప ప్రయాణికుల కోసం సిటీ బస్సులు తిరగడం లేదని భెల్ డీఎం తెలిపారు.
ఇవీ చూడండి: తెలంగాణలో కదిలిన ఆర్టీసీ చక్రం