రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 45వ రోజుకు చేరుకుంది. ఐకాస నేతల అరెస్టులను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపో ఎదుట కార్మికులు దీక్ష చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను పక్కన పెట్టి మిగిలిన సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు.
ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు