ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు సంగారెడ్డిలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. డిపో పరిధిలో ఉన్న 120 బస్సుల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా బయటకు రాలేదు. కొంతమంది ఆర్టీసీ కార్మికులు చెవుల్లో పూలు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసనను తెలిపారు. పట్టణంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టి మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ఇదీ చదవండిః కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్..