సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం తెల్లవారు జామున జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 91 మంది పోలీస్ సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. అన్నారం ప్రాంతంలో స్థానికేతరులు ఎక్కువమంది ఉన్నందున తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
తనిఖీల్లో సరైన పత్రాలు లేని 59 ద్విచక్ర వాహనాలు, 3 కార్లు, 9 ఆటోలతో పాటు... ఇద్దరు పాతనేరస్థులు, 22 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి వారి వివరాలను సేకరించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి;'హయత్ నగర్లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్... 3 ఇళ్లల్లో చోరీ'