సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మాధవిహిల్స్‌లో ఆలయ నిర్మాణంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. పార్కులో అక్రమంగా ఆలయం నిర్మిస్తున్నారని మానవహక్కుల, వినియోగదారుల రక్షణ సెల్ పిటిషన్ వేసింది. దేవుడు, దేవాలయం కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. దాతృత్వ కార్యక్రమాల పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. శాంతిభద్రతల బూచీ చూపి నచ్చిన చోట ఆలయాలకు అనుమితిస్తే ఎలా అని న్యాయస్థానం ప్రశ్నించింది. చర్యలు ఎందుకు తీసుకోలేదని అమీన్‌పూర్ పంచాయతీ ఈవోపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాజ్యంలో దేవుడిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.
దేవుడిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం - ameenpur temple today news
20:28 January 20
దేవుడిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం