రాత్రికి రాత్రే బాలిక కనిపించకుండా పోయింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన భగవాన్ తన కుటుంబంతో నివసిస్తున్నారు. కూలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈనెల 10న రాత్రి తొమ్మిదో తరగతి చదువుతున్న అతని కూతురు అనుకుమారి ఇంటి నుంచి అదృశ్యమైంది.
కూతురు కోసం తండ్రి తెలిసిన వారి దగ్గర, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. రెండు రోజులైనా తన కూతురు ఆచూకీ తెలియకపోవడం వల్ల బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : పసిపిల్లను పనిపిల్ల చేసి... చిత్రహింసలు