ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్ సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఐబీ నుంచి కొత్త బస్టాండు వరకు రాస్తారోకో నిర్వహించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక సవరణ చట్టాలను ఆపాలని పేర్కొన్నారు.
కనికరం లేదా..
రైతులను కూలీలుగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం సరైనది కాదని కార్మిక సంఘాలు వెల్లడించాయి. ఎన్ని నిరసనలు, ఆందోళనలు చేసినా ప్రధాని మోదీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దిల్లీలో రైతు దీక్షలు చూసి కూడా కనికరం రాలేదా అని ప్రశ్నించారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో కనిపించని భారత్ బంద్ ప్రభావం