ETV Bharat / state

Medical Devices Park Sultanpur : '2030 నాటికి హైదరాబాద్​ లైఫ్​సెన్సెస్ విలువ 100 బిలియన్ డాలర్లు' - తెలంగాణలో మెడికల్ డివైజెస్ పార్కు

Medical Devices Park Sultanpur : మెడికల్‌ డివైజెస్‌ రంగానికి తెలంగాణను కేంద్రంగా మార్చేలా ప్రభుత్వం ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 50 బిలియన్‌ డాలర్లు ఉన్న హైదరాబాద్‌ లైఫ్‌సైన్సెస్‌ పరిశ్రమ విలువను 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.

Medical Devices Park Sultanpur
Medical Devices Park Sultanpur
author img

By

Published : Dec 16, 2021, 8:38 AM IST

100 బిలియన్ డాలర్ల లక్ష్యం

Medical Devices Park Sultanpur : జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్ తన బలాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి తారక రామారావు స్పష్టం చేశారు. సంగారెడ్డి సుల్తాన్ పూర్‌లోని వైద్య పరికరాల తయారీ పార్క్‌లో ఏడు పరిశ్రమలను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ 7 సంస్థలు 265 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1300 ఉద్యోగాలను కల్పిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ప్రోమియా థెరపెటిక్స్, హువెల్ లైఫ్ సైన్సెస్, ఆక్రితి ఆక్యులోప్లస్ట్రీ, ఆర్కా ఇంజినీర్స్, ఎస్వీపీ టెక్నో ఇంజినీర్స్, ఎల్వికాన్ అండ్ రీస్ మెడిలైఫ్యా జమాన్యాలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన వైద్య పరికరాల పార్కులో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.హైదరాబాద్‌ లైప్‌సైన్స్‌ రంగం విలువను 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ప్రకటించారు.

అది బలంగా విశ్వసిస్తాను..

Sultanpur Medical Devices Park : "సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని వైద్య పరికరాల పార్కు ఒకే రోజు ఏడు పరిశ్రమలు ప్రారంభించేంతగా రూపుదిద్దుకోవడం సంతోషంగా ఉంది. ఈ పార్కులో ఇక ఎలాంటి ఖాళీ లేదని లైఫ్‌ సైన్సైస్‌ డైరెక్టర్ శక్తి చెప్పారు. 50కిపైగా కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. వాటిలో ఏడు కార్యకాలాపాలు ప్రారంభించాయి. మిగిలిన సంస్థలు వీటిని అనుసరించనున్నాయి. హైదరాబాద్ లైఫ్‌ సైన్సెస్‌కు రాజధాని అని బలంగా విశ్వసిస్తాను. మొత్తం లైఫ్‌సైన్సైస్‌ రంగానికి సంబంధించి తన బలాన్ని హైదరాబాద్‌ ఎప్పుడూ సంఘటితం చేస్తూనే ఉంటుంది. బల్క్‌డ్రగ్స్‌, ఔషధాలు, బయో టెక్నాలజీ, టీకాల ఉత్పత్తి, మెడికల్‌ డివైజెస్‌, హైదరాబాద్‌ ఫార్మాసిటీతో హైదరాబాద్‌ లైఫ్‌సైన్సెస్‌ రంగం భవిష్యత్‌ బలంగా ఉందని నాకు పూర్తి విశ్వాసం ఉంది."

- కేటీఆర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి

  • IT and Industries Minister @KTRTRS inaugurated the Akriti Oculoplasty company in Medical Devices Park. Akriti is one of the first companies in India to manufacture end to end eyewear frames, reading glasses, safety glasses, diagnostics products, & many other surgical implants. pic.twitter.com/xDP62FLTso

    — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ప్రోత్సాహం..

KTR on Hyderabad Life Sciences : 2017లో 7 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైజెస్‌ పార్కును ప్రారంభించినట్లు కేటీఆర్‌ గుర్తుచేశారు. ఇందులో 50కి పైగా కంపెనీలు స్థలం తీసుకోగా ఏడు యూనిట్లను ప్రస్తుతం ప్రారంభించామని తెలిపారు. ఇక్కడే వచ్చే ఏప్రిల్‌లో ఆసియా ఖండంలో అతిపెద్దదైన స్టంట్‌ ఉత్పత్తి కంపెనీ ప్రారంభానికి సిద్ధమైందని తెలిపారు.

  • Minister @KTRTRS addressed the gathering after inaugurating seven factories in Medical Devices Park, Sultanpur, Sangareddy. pic.twitter.com/w7FeSBz4bg

Medical Devices Park in Telangana : ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం మేరకు పక్కా వ్యూహాలతో లైఫ్ సైన్సెస్ రంగాన్ని బ‌లోపేతం చేస్తున్నామని చెప్పారు. ముచ్చర్లలో 19 వేల ఎక‌రాల్లో ఫార్మా సిటీ నిర్మిస్తూనే.. జీనోమ్ వ్యాలీ విస్తరణకు ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో పరిశ్రమలు స్థాపించే పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.