ETV Bharat / state

చదువుల తల్లి మురిసేలా.. నలుగురూ మెచ్చేలా.. ఆ ఊరి ప్రభుత్వ పాఠశాల.! - zilla parishad school in eddula mailaram

ప్రభుత్వ పాఠశాలలంటే అందరికీ గుర్తొచ్చేవి వెలిసిపోయిన రంగులు, విరిగిన కిటికీలు, శుభ్రతలేని పరిసరాలు.! ఇది ఒకప్పటి మాట.. మారుతున్న కాలాలను బట్టి కొందరి ప్రత్యేక ఆసక్తితో మారుమూల గ్రామాలు సైతం ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా కంటికి కనువిందు చేస్తున్నాయి. విభిన్న కళాకృతులతో సొబగులు అద్దుకుంటున్నాయి. విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని, చదువుపైన ధ్యాసను పెంపొందేలా చేస్తున్నాయి. పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అలాంటి కోవకు చెందినదే.. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎద్దుమైలారం గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల.. ఆ పాఠశాలపై 'ఈటీవీ భారత్‌' ప్రత్యేక కథనం.

eddu mailaram government school
ఎద్దు మైలారంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల
author img

By

Published : Mar 19, 2021, 2:11 PM IST

సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 170 మంది విద్యార్థులు చదువుతున్నారు. వసతుల లేమి, సదుపాయాల కొరతతో ఉన్న పాఠశాలను సర్పంచ్, ఎంపీటీసీలు, ఉపాధ్యాయ సిబ్బంది చొరవ తీసుకొని అద్భుతంగా తీర్చిదిద్దారు. పాఠశాలలో కళలు, సంస్కృతి, దేశభక్తిని గుర్తుచేసేలా తరగతి గదుల గోడలపై వాటి చిత్రాలను వేయించారు. ఆవరణలోని చెట్లపైన పక్షుల కోసం ప్రత్యేకంగా గూళ్లను ఎంతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. పాఠశాల ముందు భాగంలో చదువుల తల్లి సరస్వతీ దేవి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. పిల్లలు ఆడుకోవడానికి విలాసవంతమైన మైదానాన్ని ఏర్పాటు చేశారు. శౌచాలయాల గోడలకు కంటికి ఇంపుగా ఉండే రంగులను అద్దారు.

చదువుల తల్లి మురిసేలా.. నలుగురూ మెచ్చేలా.. ఆ ఊరి ప్రభుత్వ పాఠశాల.!

విద్యార్థుల కోసం...

ప్రైమరీ విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థం కావడానికి టీవీ, గ్రంథాలయం ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఆసక్తికరమైన అంశాలను, ఆటలను నేర్పించడానికి శిక్షణా సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో ఇంకో ప్రత్యేకత.. ఆరోగ్యబాల అనే కార్యక్రమం ద్వారా అనారోగ్యంతో ఉన్న పిల్లలకు వైద్య సహాయం అందిస్తున్నారు.

ఉత్తమ పాఠశాల అనిపించేలా
ఐదేళ్లుగా పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధిస్తూ జిల్లాలో ఆదర్శంగా నిలవడమే కాక పాఠశాల అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా తీర్చిదిద్దారు. అధికారులు, గ్రామ పంచాయతీ సభ్యులు తమకు ఎల్లపుడూ అండగా ఉంటున్నారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఎద్దుమైలారం పాఠశాలను రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఆరో రౌండ్ లెక్కింపు​ పూర్తి.. ఆధిక్యంలో సురభి వాణీదేవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.