పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉర్దూ మీడియం విద్యార్థులు ఫ్లకార్డులు, జాతీయ జెండాలు చేతపట్టుకొని ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళాశాల నుంచి ఆర్టీసీ బస్టాండ్, బ్లాక్ రోడ్డు మీదుగా ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన కొనసాగించారు.
అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. భిన్నత్వంలో ఏకత్వంగా జీవించే భారత ప్రజల మధ్య ప్రభుత్వం కులమతాల చిచ్చు రేపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనకు వివిధ సామాజిక సంఘాల నాయకులు మద్దతు పలికారు.
ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు