సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గేయం ఆలపించారు.
అమరవీరులకు నాయకులు నివాళులర్పించారు. భౌతిక దూరం పాటించే విధంగా జాగ్రత్తలు పాటించారు.