శివరాత్రి పర్వదినం తర్వాత శనివారం... అమావాస్య కావడంతో శని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మహ్మదాపూర్లోని శనేశ్వర ఆలయంలో శని దేవుడిని నల్లటి దుస్తులతో అలంకరించి... అభిషేకాలు చేశారు. అనంతరం శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు.
మహాశివరాత్రిని పురస్కరించుకొని మూడు రోజులుగా వేడుకలు నిర్వహించామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.
ఇదీ చదవండి: కన్నుల పండువగా శ్రీకనకసోమేశ్వరుని రథోత్సవం