కరోనా రెండో దశ ప్రభావంతో.. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. అర్చకులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. రాములోరి కల్యాణాన్ని చూడముచ్చటగా నిర్వహించారు. పూల మాలలతో ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు.
ఈ ఏడాది కొవిడ్ ఉద్ధృతి లేకుంటే.. శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగేవని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతో కరోనా మహమ్మారి బాధలు త్వరగా తొలగిపోయి.. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: భద్రాద్రిలో కనుల పండువగా సీతారాముల కల్యాణం