ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనం, చెత్త నుంచి ఎరువుల తయారీ నిరంతరం జరగాలని జడ్పీ సీఈవో ఎల్లయ్య సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలపరిషత్ కార్యాలయంలో చెత్త నుంచి ఎరువుల తయారీ షెడ్లనిర్వహణపై డివిజన్ స్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీ నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేయాలని తెలిపారు.
పారిశుద్ధ్య నిర్వహణ, వైకుంఠధామం నిర్మాణం, వంద శాతం పన్ను వసూలు జరిగేలా చూడాలని అన్నారు. సమావేశంలో జహీరాబాద్ మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్, కోహిర్, రాయికోడ్ మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: బైరామల్‌గూడ పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్