సంగారెడ్డి జిల్లాలో లాక్డౌన్ పూర్తిగా అమలయ్యేలా సిబ్బందిని మోహరించామని ఎస్పీ చంద్రశేఖర రెడ్డి తెలిపారు. పటాన్చెరు శివారులోని బాహ్య వలయ రహదారి కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను ఆయన పరిశీలించారు. జాతీయ రహదారిపై అత్యవసర రవాణా వాహనాలకు అనుమతి ఉందని... ఇతర వాహనాలు నిలువరిస్తున్నామని వెల్లడించారు.
వాహనాల్లో వెళ్లే వారి వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లోనూ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొవిడ్ సేవల కోసం వెళ్లేవారిని అనుమతిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ కేంద్రం నుంచి 25 మంది రోగులు పరార్!