సంఘాల అభివృద్ధితో ఉద్యోగుల జీవితాలు మెరుగవుతాయని సంగారెడ్డి జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు సుశీల్ బాబు అన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం భవనాన్ని జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. యూనియన్‌లు సజావుగా సాగడానికి సంఘం భవనాలు ఉపయోగపడుతాయని ఆయన తెలిపారు.
అందరూ సంఘం పటిష్టత కాపాడాలని కోరారు. భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు యాదవరెడ్డి, కార్యదర్శి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: థియేటర్‌కి.. పాప్‌కార్న్‌కు సంబంధమేంటి?