పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామాన్ని పాలనాధికారి హనుమంతరావు సందర్శించారు. మండల అధికారులతో కలిసి గ్రామంలో కలియ తిరిగారు. పారిశుద్ధ్య నిర్వహణ, వైకుంఠధామం తదితర పనులను పరిశీలించారు.
పరిసరాల పరిశుభ్రత ముఖ్యం..
ఆరోగ్య భద్రతకు పరిశుభ్రతను మించిన మందు లేదని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దోమలు వ్యాప్తి చెందకుండా.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, హరితహారం మొక్కల సంరక్షణపై అధికారులను ప్రశంసించారు. సర్పంచు, పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: డాక్టర్లకు కరోనా ఎలా వచ్చింది?: ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్