దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. పర్యావరణంలో నోబెల్ బహుమతిగా అభివర్ణించే ఈక్వేటర్ అవార్డును సంగారెడ్డి జిల్లా డీడీఎస్ మహిళలు అందుకున్నారు. సేంద్రియ చిరుధాన్యాలు సాగు చేసే మహిళా రైతులు.. పర్యావరణ పరిరక్షణలో చేసిన విశేష కృషిని జిల్లా కలెక్టర్ అభినందించారు.
అసలైన నాగరికత వీరిదే...
నాగరికులమని చెప్పుకునే వారంతా ప్రపంచం ఏటు పోతుందా అని చూస్తూ ఉంటారని.. డీడీఎస్ మహిళా రైతులు ప్రపంచమే తమ వైపు చూసేలా చేశారని సామాజిక సేవకురాలు స్రవంతి అన్నారు. పాత తరానికి చెందిన చిరుధాన్యాలు సాగు చేస్తూ.. భవిష్యత్ తరాల కోసం విత్తనాలు పరిరక్షిస్తున్న ఈ మహిళా రైతులదే అసలైన నాగరికత అని పేర్కొన్నారు.
మీరూ తయారుచేయండి...
మహిళాసాధికారికతకు దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అసలైన నిర్వచనం అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు పేర్కొన్నారు. పేద మహిళల్లో ఆత్మ విశ్వాసం నింపి.. ఆర్థిక స్వావలంబన కోసం.. డీడీఎస్ కృషి చేస్తోందన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో హిమోగ్లోబిన్ శాతం పెంచేలా డీడీఎస్ ఉత్పత్తులు తయారు చేస్తే.. వాటిని అంగన్ వాడీలో అందిస్తామని కలెక్టర్ హమీ ఇచ్చారు.
పల్లెటూరి వారైనా.. వినూత్న ఆలోచనలతో అంతర్జాతీయ సమాజాన్ని తమ వైపుకు తిప్పుకున్న డీడీఎస్ మహిళలు... ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
- ఇదీ చూడండి : అంత్యక్రియలైన 20రోజులకు ఆ వ్యక్తి బతికి వచ్చాడు!