సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో పారిశుద్ధ్యం బాగాలేదని, డంప్ యార్డు, వైకుంఠధామం, నర్సరీ పనుల్లో పురోగతి లేదని కార్యదర్శి హరిశంకర్కు జిల్లా పాలనాధికారి హనుమంతరావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇస్నాపూర్లో జిల్లా పాలనాధికారి హనుమంతరావు ఆకస్మిక తనిఖీలో భాగంగా పనులను పరిశీలించారు. చెత్తను దారిలో వేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ పనితీరుపై మండిపడ్డారు.
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దే విధంగా అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వకుండా కలిపి ఇస్తున్న ఇంటికి జరిమానా విధించాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. తడి, పొడి చెత్తలు వేర్వేరుగా ఇచ్చేలా మహిళలకు అవగాహన కల్పించాలన్నారు.
ఇవీ చూడండి: పని దొరికితేనే పూటగడుస్తోంది.. లేకుంటే అదోగతే.!