రైతు వేదికల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. నారాయణఖేడ్ మండలంలో జిల్లా పాలనాధికారి పర్యటించారు. నిర్మాణంలో ఉన్న రైతు వేదికల పనుల పురోగతి, నాణ్యతను స్వయంగా పరిశీలించారు.
నాణ్యత విషయంలో రాజీపడొద్దని స్పష్టం చేశారు. పనులు త్వరగా పూర్తికావాలని. జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని సర్పంచ్‌లకు సూచించారు. కలెక్టర్ వెంట రెవెన్యూ డివిజనల్ అధికారి అంబాదాస్ రాజేశ్వర్, ఏడీఏ కరుణాకర్‌రెడ్డి ఉన్నారు.
ఇవీచూడండి: రాష్ట్ర హెచ్ఆర్సీని ఆశ్రయించిన మధ్యమానేరు నిర్వాసితులు