డంపు యార్డు, వైకుంఠధామాల నిర్మాణాలు నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు, సర్పంచ్‌లపై చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని రామతీర్థం గ్రామపంచాయతీని స్థానిక అధికారులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. పనుల పురోగతిని పరిశీలించిన జిల్లా పాలనాధికారి.. జాప్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు.
ఆయా మండలాల్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిరోజూ పనుల పురోగతి మెరుగుపడేలా చూడాలన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి పనులను పరిశీలించారు. సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలో పారిశుద్ధ్య, హరితహారం పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి పంచాయతీ కార్యదర్శి రమేశ్‌కు షోకోజ్ నోటీసు జారీచేశారు.
![sangareddy collector hanumatharao fire on village officers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-srd-36-11-collector-fire-ts1055_11072020141011_1107f_1594456811_488.jpg)