నూతన నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై సంగారెడ్డి జిల్లా ఆలూరు మండలం దానంపల్లిలో రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పంటలు వేసే విధానంపై ఆయన రైతులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. దొడ్డు రకం కన్నా సన్నరకం బియ్యానికి విపణిలో మంచి డిమాండ్ ఉందని వెల్లడించారు.
లేకపోతే పత్తిని వేసుకోవచ్చునని ఆయన సూచించారు. జిల్లాలోని 116 క్లస్టర్లలో రైతుల సమావేశం జరుగుతున్నాయని తెలిపారు. అన్నదాతల అభీష్టం మేరకే పంటలను వేయాలని ఆయన వెల్లడించారు. వానాకాలం పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.