పోతిరెడ్డిపాడు విషయంలో కలుగజేసినందుకు గానూ... సంగారెడ్డిలో జిల్లా శాఖ భాజపా ఆధ్వర్యంలో కేంద్ర నాయకుల చిత్రపటాలకు పూలభిషేకం చేశారు. పోతిరెడ్డిపాడు విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. జల దోపిడీ జరుగుతుంటే సీఎం కేసీఆర్ మౌనంగా ఉండటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాయకులు ధర్నాలు, ర్యాలీలు చేస్తే స్పందించే సీఎం కేసీఆర్... ఇంత నీటి దోపిడీ జరుగుతుంటే ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రా భాజపా నాయకులు రాసిన ఉత్తరం వల్ల తెలంగాణ ప్రజలకు ఊపిరి అందించిందన్నారు. అపెక్స్ మీటింగ్ తర్వాత తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని భాజపా నాయకులు తెలిపారు.