సంగారెడ్డి జిల్లా మనూరు మండలం రాయిపల్లి వంతెనపై నుంచి మంజీరా నదిలో దూకి అరుణ అనే వ్యవసాయశాఖ అధికారిణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నారాయణఖేడ్ మండలం పైడిపల్లికి చెందిన అరుణ... సంగారెడ్డి జిల్లాలో రైతు శిక్షణ కేంద్రంలో ఏవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. మనూరు మండలంలోని మొర్గికి చెందిన శ్రీనివాస్‌తో అరుణ వివాహం జరగ్గా వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. కుటుంబసమేతంగా పట్టణంలో నివాసం ఉంటున్నారు.
గురువారం రోజున ఘటనా స్థలానికి కారులో వచ్చిన అరుణ వంతెనపై కారు నిలిపి.. నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అరుణ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. నదిలో నీటి మట్టం ఎక్కువ ఉండటం వల్ల మృతదేహం గుర్తించలేకపోయారు.
ఇదీ చూడండి: సడెన్ బ్రేకేసిన లారీ... వరుసగా ఢీకొన్న కార్లు