సంగారెడ్డిలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు భిక్షాటన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మెలోకి ఉన్నత ఉద్యోగులు వచ్చి తమకు మద్దతు తెలిపాలని కోరారు. ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం వల్ల ఇల్లు గడవటం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: ఆర్టీసీని కాపాడుకోవడమే సమ్మె ఉద్దేశంః అశ్వత్థామరెడ్డి