ETV Bharat / state

'440 మంది రోడ్డుప్రమాదంలో చనిపోయారు' - సంగారెడ్డి జిల్లాలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

సంగారెడ్డిలో 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. డ్రైవర్లు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 40 మంది హత్యకు గురైతే.. 440 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్నారు.

'40 మంది హత్యకు గురైతే.. 440 మంది రోడ్డుప్రమాదంలో చనిపోయారు'

author img

By

Published : Jan 31, 2020, 3:16 PM IST

'40 మంది హత్యకు గురైతే.. 440 మంది రోడ్డుప్రమాదంలో చనిపోయారు'

ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మంది చనిపోతున్నారని.. ఇందుకు ముఖ్య కారణం వాహనచోదకుల నిర్లక్ష్యమే అని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​ రెడ్డి తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న 31వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్రైవర్లకు, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 40 మంది హత్యకు గురైతే.. 440 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్నారు.

చిన్న నిర్లక్ష్యం వల్ల వారి కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యంగా 30 నుంచి 40 సంవత్సరాల వారు మృత్యువాత పడుతున్నారని స్పష్టం చేశారు. హెల్మెట్ ధరించి.. మద్యం సేవించకుండా వాహనాలు నడపాలని సూచించారు.

ఇవీ చూడండి: త్వరలో టీస్​బీపాస్​ తీసుకొస్తాం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.