తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రెవెన్యూ ఉద్యోగులు సంతాప సభ నిర్వహించారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట విజయారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మార్వోపై ఉన్మాదిలా పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ ఉద్యోగుల చేస్తున్న ఆందోళనకు ఆర్టీసీ కార్మికులు హాజరై సంఘీభావం ప్రకటించారు.
ఇవీ చూడండి: ఏకకాలంలో 169 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు