ETV Bharat / state

REVANTH REDDY: దళితబంధు కోసం సచివాలయం, అసెంబ్లీ అమ్మేద్దాం: రేవంత్‌ రెడ్డి - telangana varthalu

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 20 నెలల భయం పట్టుకుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మరో 20 ఏళ్లు అధికారం మనదే అన్నప్పుడే కేసీఆర్ తన ఓటమిని అంగీకరించినట్లయిందని తెలిపారు. మొదటిసారి కేసీఆర్‌లో భయం కనిపిస్తుందని...అందుకు అంచనాలు లేని హామీ ఇస్తున్నారని దుయ్యబట్టారు. మూడుచింతలపల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

REVANTH REDDY: 'ప్రభుత్వ ఆస్తులు అమ్మైనా దళితబంధు ఇవ్వాలి'

author img

By

Published : Aug 25, 2021, 5:15 PM IST

మొదటిసారి సీఎం కేసీఆర్‌లో భయం కనిపిస్తోందని, అందుకే అంచనాలు లేని హామీలు ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇంకా 20 ఏళ్లు అధికారం మనదే అన్నప్పుడే కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారని ఆయన అన్నారు. తెరాస కార్యవర్గ సమావేశం తర్వాత ఎవరూ మీడియాతో మాట్లాడలేదని... చివరికి కేసీఆర్​ ఆవేదన చూసి కేటీఆర్​ మీడియా సమావేశం పెట్టారని రేవంత్​ పేర్కొన్నారు. తెరాసలో ఉద్ధండులు కూడా మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. భవిష్యత్​లో తెరాస సీనియర్​ లీడర్లు కూడా కేసీఆర్​ పక్కన కూర్చోవడానికి భయపడతారని అన్నారు. కేసీఆర్ ఒంటరి వారయ్యారన్నారు. మూడుచింతలపల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

కేసీఆర్ ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని.. ఆ భ్రమల్లోనుంచి జనాలు ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నారన్నారు. రాత్రి దళిత వాడలో తాను పడుకున్నానని...35సంవత్సరాల కిందటి జ్ఞాపకాలే ఇందిరమ్మ ఇళ్లని తెలిపారు.మూడు చింతలపల్లి గ్రామానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని రేవంత్​ ఆరోపించారు. మూడు చింతలపల్లిలో కేసీఆర్ ఫాంహౌస్​ కోసం రెండేళ్ల క్రితం రోడ్డును 6ఫీట్లకు పెంచి వేశారని... ఈ నేపథ్యంలో ఇళ్లు కిందకు అయ్యాయని, రోడ్డు పైకి అయిందన్నారు. డబుల్ బెడ్​రూం ఇళ్లు ఇస్తా అని ఇంతవరకు ఇవ్వలేదని రేవంత్​ విమర్శించారు. వర్షం పడగానే ఆ ఇళ్లు చెరువులా మారుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

దళితబంధు అందరికి ఇవ్వాలనేదే తమ డిమాండ్‌గా పేర్కొన్నారు. బడ్జెట్‌ సరిపోకపోతే సెక్రటేరియేట్‌, అసెంబ్లీ అమ్ముదామని ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పితే పెడుతామన్నారు. జీహెచ్‌ఎంసీలో అందరికి పదివేల సహాయం ఇవ్వని కేసీఆర్‌...దళితులందరికి దళితబంధు ఇస్తారంటే నమ్ముతామా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌లకు డీజీపీ హోదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.