కూడు, గూడు లేని ఓ వృద్ధురాలికి ఓస్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు అండగా నిలిచారు. సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటకు చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలికి ఎవరూ లేరు. ఆమె గుడిసె పక్కనే నివసించే నర్సమ్మ కుటుంబం ఆ వృద్ధురాలికి అండగా ఉంటోంది. భోజనం పెట్టడంతో పాటు ఇతర సపర్యలూ చేస్తున్నారు. ఈ విషయాన్ని ‘ఆకలితో అల్లాడితే... చూస్తూ ఊరుకోదు ‘అమ్మ’’ శీర్షికన ‘ఈనాడు’ చిత్ర కథనాన్ని అందించింది.
సంగారెడ్డికి చెందిన మనసేవా సమితి ప్రతినిధులు స్పందించారు. నర్సమ్మకు సరకులు ఇచ్చి మరింత బాగా చూసుకోవాలని కోరారు. ఏ సంబంధం లేకున్నా ఆమె బాగోగులు చూస్తున్న నర్సమ్మను అభినందించారు. వృద్ధురాలు నివసిస్తున్న ప్రాంతం తీవ్ర దుర్గంధభరితంగా ఉండటం గుర్తించి.. వారం రోజుల్లోగా దీనిని మొత్తం శుభ్రం చేయించి పకడ్బందీగా ఉండేలా గుడిసెను నిర్మించి ఇస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: ప్రాథమిక సమాచారం ఉంది..రైల్వే సిబ్బంది అస్వస్థత నిజమే