సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ప్రాదేశిక ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్న డ్రైవర్లకు ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదని ఆరోపిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా వేతన చెల్లింపుల్లో... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డ్రైవర్లు ఆరోపించారు. విధులు నిర్వహించిన అందరికీ డబ్బులు ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
ఇవీ చూడండి: 32 ఎమ్మీ నామినేషన్లతో గేమ్ ఆఫ్ థ్రోన్స్ రికార్డు