సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పృద్ధ్వీరాజ్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ప్రతి మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసుకుని రైతులకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.
ప్రజలంతా కరోనా నుంచి అప్రమత్తంగా ఉండాలని పృద్ధ్వీరాజ్ సూచించారు. అందరికి అన్నం పెట్టే రైతులు మహమ్మారి బారిన పడొద్దని కోరారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చూడండి: అమ్మలూ... ఇవే మీ ఆయుధాలు