ETV Bharat / state

రాష్ట్రంలో రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు - telangana varthalu

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. కల్లాల్లోని వరిపంట వర్షార్పణమైంది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నీటి పాలవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు వేర్వేరు చోట్ల పిడుగుపాట్లకు గురై... ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

rains
రాష్ట్రంలో రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు
author img

By

Published : May 15, 2021, 4:28 AM IST

రాష్ట్రంలో రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు

రాష్ట్రంలో అకాల వర్షాలు విషాదాన్ని నింపాయి. పిడుగుపాటులకు వేర్వేరు చోట్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి నలుగురు దుర్మరణం చెందారు. మునిపల్లి మండలం మక్దూంపల్లిలో తండ్రీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. మృతులు మాచగోని కృష్ణ, ప్రశాంత్‌గా గుర్తించారు. కంగ్టి మండలం తడ్కల్ వద్ద పిడుగుపాటుకు పశువుల కాపరి సురేశ్ మృతి చెందారు. పుల్కల్ మండలం పోచారంలో పిడుగు పడి మేకల కాపరి చంద్రయ్య ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లాలోనూ పిడుగులకు ఇద్దరు బలయ్యారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన ఓరుసు మల్లయ్య, అల్లేపు రవి వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్నారు. వర్షం పడుతోందని పశువుల కొట్టంలో తలదాచుకున్నారు. కొట్టంపై పిడుగు పడటంతో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు.

కన్నీరుమున్నీరవుతున్న రైతులు

మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. లక్షెట్టిపేట కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యంతోపాటు తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిచి పోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. సకాలంలో తూకం వేయకుండా, ధాన్యం తరలించకపోవడంతోనే ధాన్యం తడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు పరిధిలోని తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల్లో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. తూకం కోసం తీసుకువచ్చిన ధాన్యం బస్తాల కింద వరదనీరు చేరింది. చేతికొచ్చిన మామిడి కాయలు పెద్దఎత్తున నేలరాలాయి. ఈదురుగాలులతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఈదురుగాలుల బీభత్సం

నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరులో అకాల వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గత 10రోజుల క్రితం మార్కెట్‌కు తీసుకువచ్చిన వరిధాన్యం తూకం వేయకపోవటంతో నిలిచిపోయింది. నిన్న మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం బస్తాల చుట్టూ వాననీరు చేరటంతో... రైతులు కన్నీరుమున్నీరయ్యారు.

మూడ్రోజుల పాటు వర్షాలు

విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణితో పాటు ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం బలపడి... రాగల 24 గంటల్లో తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. దక్షిణ తెలంగాణ జిల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: పిల్లలకు కరోనా టీకా ఎప్పుడు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.