కరోనా ప్రభావంతో విద్యా విధానం రూపురేఖలు మారిపోయాయి. విద్యార్థుల విద్యా సంవత్సరం అతలాకుతలం అయ్యింది. విద్యార్థులు కొందరు తమ చదువును కొంత మర్చిపోయారు. కరోనా మహమ్మారి వల్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. సంగారెడ్డి జిల్లాలో పక్కా ప్రణాళికతో పాలిసెట్ పరీక్షను నిర్వహిస్తున్నారు.
విద్యార్థులు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను థర్మల్ స్క్రీనింగ్ చేసి, చేతులు శానిటైజ్ చేసుకున్న తర్వాత లోనికి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: పక్కా ఏర్పాట్లు.. ప్రారంభమైన పాలిసెట్