కర్ఫ్యూ సమయంలో అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులపై సంగారెడ్డి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. ఆంక్షాలకు విరుద్ధంగా... అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసు నమోదు చేసి.. వాహనాలు సీజ్ చేశారు.
తనిఖీలను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షిచారు. ప్రజలు కర్ప్యూ సమయంలో బయటికి రావోద్దని పోలీసులు సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.