ETV Bharat / state

పటాన్​చెరులో జనతా కర్ఫ్యూ విజయవంతం - coronavirus updates

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతగా పటాన్​చెరు నియోజకవర్గ కేంద్రంలో ఇళ్ల ముందుకు వచ్చి ప్రజలు చప్పట్లు కొట్టారు.

people-claps-in-patancheru
పటాన్​చెరులో జనతా కర్ఫ్యూ విజయవంతం
author img

By

Published : Mar 23, 2020, 5:15 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పట్టణంలో ఉదయం నుంచి జనతా కర్ఫ్యూలో భాగంగా... ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సంపూర్ణంగా విజయవంతం చేశారు. ఎక్కడ చూసినా.. నిర్మానుష్య రహదారులు, మూసివేసిన దుకాణాలు, హోటళ్లు దర్శనమిచ్చాయి.

సాయంత్రం 5గంటల సమయంలో ఇలా బయటకు వచ్చి, సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞత తెలుపుతూ, ప్రజలు చప్పట్లు కొట్టారు. ఇందులో... చిన్నపిల్లలూ కనిపించారు. అలాగే, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు చరిచారు.

పటాన్​చెరులో జనతా కర్ఫ్యూ విజయవంతం

ఇవీ చూడండి: కేసీఆర్​ తెచ్చిన 'కరోనా చట్టం'తో ఏం చేయొచ్చో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.