ETV Bharat / state

ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అధిష్ఠానం షాక్.. బాధ్యతల నుంచి తప్పించిన పీసీసీ - ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అధిష్ఠానం షాక్

PCC relieved of responsibilities assigned to MLA Jaggareddy
ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అధిష్ఠానం షాక్.
author img

By

Published : Mar 21, 2022, 5:02 PM IST

Updated : Mar 21, 2022, 9:37 PM IST

16:50 March 21

జగ్గారెడ్డికి అప్పగించిన బాధ్యతల నుంచి తప్పించిన పీసీసీ

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆయనకు అప్పగించిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతల నుంచి తప్పించినట్లు ప్రకటించింది. పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా జగ్గారెడ్డిని తప్పించినట్లు పీసీసీ పేర్కొంది. ఆయనకు గతంలో అప్పగించిన బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది.

బాహాటంగానే విమర్శలు

సంగారెడ్డి MLA జగ్గారెడ్డి కొద్దిరోజులుగా రేవంత్‌రెడ్డి తీరును తప్పుపడుతున్నారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని మండిపడుతున్నారు. బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌పైనా తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్న హైదరాబాద్‌ హోటల్‌ అశోకలో కాంగ్రెస్‌ విధేయుల గ్రూప్‌ పేరుతో సమావేశం నిర్వహించారు. మర్రి శశిధర్‌రెడ్డి, వి.హన్మంతరావుతో కలిసి భేటీ అయ్యారు. పీసీసీ వారించినా వినకుండా భేటీ కొనసాగించారు. తనను సస్పెన్షన్‌ చేసినా భయపడేది లేదని.. రోజుకొకరి వ్యవహారాలు బయటపెడతానంటూ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పీసీసీ.. జగ్గారెడ్డికి అప్పగించిన బాధ్యతల నుంచి తప్పించింది.

ఇదీ చదవండి: CM KCR in TRSLP Meeting: కేంద్రంపై పోరుకు కార్యాచరణపై తెరాస శ్రేణులకు సీఎం దిశానిర్దేశం

Last Updated : Mar 21, 2022, 9:37 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.