ETV Bharat / state

అన్నదాతలను ముప్పుతిప్పలు పెడుతున్న ఉల్లిధర - Onion latest updates

ఉల్లి ధర... రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. కనీసం పెట్టిన పెట్టుబడి రాలేని స్థాయికి పడిపోతుంది. వారం పది రోజుల వరకు రేటుతో ఘాటెక్కించిన ఉల్లి... ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకువచ్చే సమయానికి గిట్టుబాటు ధర రాక అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు.

అన్నదాతలను ముప్పుతిప్పలు పెడుతున్న ఉల్లిధర

author img

By

Published : Mar 22, 2021, 5:07 AM IST

Updated : Mar 22, 2021, 5:29 AM IST

అన్నదాతలను ముప్పుతిప్పలు పెడుతున్న ఉల్లిధర

గత నాలుగేళ్లుగా ఉల్లి సాగు చేస్తున్న రైతులు నష్టాలు మూట గట్టుకుంటున్నారు. ఓ ఏడాది వాతావరణం దెబ్బతీస్తే... మరోసారి మార్కెట్‌లో ధర లేక అప్పులపాలవుతున్నారు. కేవలం నారు నాటుకునే సమయంలోనే రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు ఖర్చు అవుతోందని... పంట చేతికి వచ్చే సమయానికి రూ. 50 వేలు పెట్టుబడి అవుతోందని రైతులు తెలిపారు.

అన్నీ అనుకూలిస్తే 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని తెలిపారు. కానీ, ప్రస్తుతం క్వింటాల్ ధర రూ. వెయ్యి లోపే పలుకుతుండటం వల్ల పెట్టుబడి రానీ పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

ఇనామ్ విధానం...

జనవరిలో క్వింటాల్ ఉల్లిగడ్డ ధర రూ. 3 వేల నుంచి రూ. 5వేల వరకు పలికింది. వారం క్రితం వరకు రూ. 1,500 ఉండగా ప్రస్తుతం రూ. 900 మించడం లేదు. నెలల తరబడి శ్రమించి పండించిన పంటను మార్కెటుకు తీసుకువచ్చే సమయానికి ధర పడిపోతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో తెచ్చిన ఇనామ్ విధానం న్యాయం చేయలేకపోతుందని తెలిపారు.

రూ. 1,500 పలికితేనే...

కర్నూలుతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నిత్యం రాష్ట్రానికి కనీసం 300 లారీల ఉల్లి సరుకు వస్తోంది. ప్రస్తుతం డిమాండ్ తగ్గిపోవడంతో ధర అదే స్థాయిలో తగ్గింది. క్వింటాకు రూ. 1,500 రేటు పలికితేనే గిట్టుబాటు అవుతుందని కర్షకులు తెలిపారు. కనీస మద్దతు ధర నిర్ణయించి అంతకన్నా తక్కువ కొనుగోలు చేయకుండా నిబంధనలు రూపొందించాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఏప్రిల్- మే మాసాల్లో ఉల్లి పూర్తిస్థాయిలో వస్తుంది. అప్పటికీ ధర ఇంకా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. ధర ఎక్కవ ఉన్న సమయంలో అమ్ముకునేలా అన్నదాతలు పంట నిల్వ చేసుకునే ప్రయత్నం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: తెరాసకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు: పద్మారావు గౌడ్​

Last Updated : Mar 22, 2021, 5:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.