సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎలాగైనా సరే కరోనా కట్టడికి కళ్లెం వేయాలనుకున్న అధికారులు ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్వచ్ఛంద లాక్డౌన్ విధించాలని తీర్మానించారు. ఇంతవరకూ కేసులు లేని పట్టణంలో... గత కొంతకాలంగా ఎక్కువగా పెరుగుతున్నాయి.
గడిచిన వారం రోజుల్లోనే పట్టణంలో 12 కేసులు నమోదయ్యాయి. దీంతో పట్టణంలో పూర్తిగా స్వచ్ఛంద లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. మెడికల్, పాల దుకాణాలు తప్ప మరే దుకాణాలు తెరవకూడదని తీర్మానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని సూచించారు. ఒకవేళ వచ్చినా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని అన్నారు.
ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్