సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చందపూర్ గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. ఆ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముఖంపై పెట్రోలు పోసి నిప్పంటించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన రెండు, మూడు రోజుల క్రితం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తరలించి ముఖం గుర్తు పట్టకుండా పెట్రోల్ పోసి తగుల పెట్టినట్లు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో విచారణ చేపట్టారు. మృతుని ఒంటిపై ఎరుపు రంగు టీ షర్ట్, బూడిద రంగు ప్యాంటు ఉన్నాయి. కనిపించకుండా పోతే నారాయణఖేడ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఇవీ చూడండి: పొదల్లో హత్య చేసి కాల్చి చంపారు