సంగారెడ్డి పట్టణంలోని నేతాజీనగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. చనిపోయిన వ్యక్తి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని సమాచారం.
చనిపోయి మూడు నుంచి నాలుగు రోజులు అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మున్సిపాలిటీ సిబ్బందితో మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని పట్టణ సీఐ వెంకటేష్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : బీర్ కేక్ ఎప్పుడైనా తిన్నారా?