సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాశమైలారం పారిశ్రామికవాడలో పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఎస్ఐఐసీ... మొక్కలను ఎలా నాటాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేందుకు ప్రధాన కార్యాలయం నుంచి ముగ్గురు ప్రతినిధులను పంపారు. వారు దగ్గరుండి పారిశ్రామికవేత్తలతో మొక్కలు నాటించారు. అనంతరం మొక్కలు నాటడం ఒక్కటే కాదని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా తమమీదే ఉందని గుర్తు చేశారు.
ఇవీ చూడండి: ట్విట్టర్ ట్రెండింగ్లో హ్యాపీ బర్త్డే కేసీఆర్