సంగారెడ్డి జిల్లా కొల్లూరులో బాహ్య వలయ రహదారి సమీపంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై "హద్దుల్లేని అక్రమాల పేరిట'..... ఈటీవీ భారత్ ఇచ్చిన కథనాలతో అధికారుల్లో స్పందన వచ్చింది. ప్రైవేట్, ప్రభుత్వ భూముల మధ్య సరిహద్దుల నిర్ధరణకు సర్వే అండ్ రికార్డ్స్, రెవెన్యూశాఖలు సంయక్త సర్వేకు ఉపక్రమించాయి. ఈ మేరకు సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఏడీ మధుసూదన్, రామచంద్రాపురం తహశీల్దారుకు ఉత్తర్వులు పంపించారు.
శనివారం ఉదయం భూ దస్త్రాలు, మండల సర్వేయర్‌తో అక్రమణలు జరిగిన భూముల వద్దకు రావాలని.. అందులో పేర్కొన్నారు. ఆ సంయుక్త సర్వేలోనైనా వాస్తవాలు నిగ్గు తేల్చుతారో లేక ఎప్పటిలాగే తూతూమంత్రంగా పూర్తిచేస్తారో చూడాలని స్థానికులు చెబుతున్నారు.