సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాధునిక ఆరోగ్య పరీక్షలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. డయాగ్నోస్టిక్ కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో మినీ హబ్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని వెల్లడించారు.
వైద్యం కోసం వచ్చే నిరుపేదలకు ఆరోగ్య పరీక్షలు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ వసుంధర, సలహా సంఘం సభ్యులు కంకర శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆ జంట.. ఫస్ట్ నైట్కు బ్రేకిచ్చిన కరోనా