ETV Bharat / state

మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి: నిర్వాసితులు - నిమ్జ్ భూ నిర్వాసితుల పోరాట సమితి

సంగారెడ్డి జిల్లా ఘరాసంగం మండలం న్యాల్​కల్​లో జాతీయ పెట్టుబడి ఉత్వాదక మండలి ఏర్పాటు కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను... భూ నిర్వాసితుల పోరాట సమితి తప్పుబట్టింది. చట్టబద్ధంగా మరోమారు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

national investment and manufacturing zone land acquisition victims on public opinion poll
మరోమారు చట్టబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి: భూ నిర్వాసితులు
author img

By

Published : Jan 23, 2021, 5:31 PM IST

చట్ట విరుద్ధంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలని... నిమ్జ్ భూ నిర్వాసితుల పోరాట సమితి డిమాండ్ చేసింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం న్యాల్​కల్​లో జాతీయ పెట్టుబడి ఉత్పాదక మండలి ఏర్పాటు కోసం ఈ నెల 20న నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ తీరను తప్పుబట్టారు.

మరో మారు రైతుల సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరారు. ప్రజాభిప్రాయ సేకరణకు హాజరు కావాలని ప్రకటించిన అధికారులు... రైతులు రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని మండిపడ్డారు. కలెక్టర్, ఎస్పీ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. చట్టబద్ధంగా మరోమారు అభిప్రాయాలు సేకరించకుంటే... న్యాయపోరాటం చేస్తామని కమిటీ ప్రతినిధులు ప్రకటించారు.

ఇదీ చూడండి: మంత్రులకు నిరసన సెగ.. సర్పంచ్​ల నిలదీత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.