సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్(53) అనారోగ్యంతో మరణించారు. రెండు రోజుల క్రితం స్వగ్రామమైన సిద్దిపేటకు వెళ్లారు. కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు.
కొద్ది రోజుల క్రితమే నారాయణఖేడ్‌లో విధులకు హాజరయ్యారు. ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు.