సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా నిర్మించిన వెంచర్‌ను మున్సిపల్ అధికారులు తొలగించారు. పురపాలక సంఘం అనుమతి లేకుండా వెంచర్లో ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగితే చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పందన ప్రకాశ్ హెచ్చరించారు. ప్రియదర్శిని కాలనీ సమీపంలో అక్రమంగా వెంచర్‌ను తొలగించినట్టు తెలిపారు. అక్రమంగా ఇంకా ఏమైనా వెలుస్తున్నాయా అన్న కోణంలో ప్లానింగ్ సెక్షన్ అధికారులు ఆరా తీస్తున్నట్టు పేర్కొన్నారు.
పట్టణ పరిధిలో మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా అక్రంగా వెలుస్తున్న వెంచర్ల వ్యవహారాన్ని సీపీఐ నాయకులు తాజొద్దీన్ ఖండించారు. వెంచర్లు అధికార పార్టీ నాయకులకు సంబంధించినవి కావటం వల్లే అధికారులతో వాగ్వివాదానికి దిగుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్నవి, పాతవి, కొత్తగా ప్రారంభించే వాటిపై విచారణ చేపట్టి... కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : దుర్గామాతకు బోనాలు సమర్పించిన మంత్రి అల్లోల