సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సంగారెడ్డి జిల్లా బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్, భావి పీఠాధిపతి సిద్దేశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో దత్తగిరి వైదిక పాఠశాల విద్యార్థులు హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
హోమాన్ని పూర్ణాహుతితో పూర్తి చేసిన పీఠాధిపతులు ముఖ్యమంత్రి కొవిడ్ మహమ్మారి నుంచి త్వరగా కోలుకొని రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాజకీయ ప్రముఖుల ఆకాంక్ష