నామినేషన్ వేసినప్పటి నుంచే అభ్యర్థుల సతీమణులు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల సమయం సమీపించడం వల్ల ప్రచారాలను మరింత ముమ్మరం చేశారు అభ్యర్థుల సతీమణులు. జహీరాబాద్ తెరాస అభ్యర్థి బీబీ పాటిల్కు మద్దతుగా ఆయన సతీమణి అరుణా పాటిల్, స్థానిక ఎమ్మెల్యే సతీమణి మధులత మహిళా కార్యకర్తలతో కలిసి రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: 'ప్రచారానికి వెళ్లకుండా ఐటీ దాడుల కుట్ర'