సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పెసర్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారీ వ్యవస్థ నిర్మూలనకు రైతులు కొనుగోలు కేంద్రం ద్వారానే పెసర్లు విక్రయించాలన్నారు. ఎవరైనా దళారులు వస్తే వారిపై పోలీస్ కేసులు పెడతామన్నారు. కార్యక్రమంలో ఏఎమ్సీ అధ్యక్షురాలు సువర్ణ షెట్కార్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'బతుకమ్మ... తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం'