ETV Bharat / sports

మెగా ఫైట్​పై మైక్ టైసన్ రియాక్షన్- ఇక్కడ ఓడినా, అక్కడ గెలిచాడట! - MIKE TYSON VS JAKE PAUL

ఓటమిపై మైక్ టైసన్ రియాక్షన్- 8 సార్లు రక్త మార్పిడి, చావు అంచు వరకూ వెళ్లొచ్చాడట!

Mike Tyson vs Jake Paul
Mike Tyson vs Jake Paul (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 17, 2024, 2:27 PM IST

Mike Tyson vs Jake Paul 2024 : 58 ఏళ్ల బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ మెగా ఫైట్ ఓటమిపై తాజాగా స్పందించాడు. తనకంటే చాలా చిన్నవాడైన 27ఏళ్ల జేక్‌ పాల్‌ చేతిలో మ్యాచ్‌ ఓడినందుకు ఏమాత్రం బాధ లేదని మైక్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్​లో ఓడినప్పటికీ, ఇటీవల మరణం అంచుల దాకా వెళ్లి అక్కడ విజయం సాధించినట్లు తెలిపాడు. ఈ మేరకు మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు.

'మనం ఓటమిలో కూడా విజయాన్ని చూసుకునే సందర్భం ఇది. గత రాత్రికి కృతజ్ఞతలు చెబుతున్నా. చివరి సారిగా బాక్సింగ్‌ రింగ్‌లోకి వచ్చినందుకు ఏ మాత్రం బాధపడటంలేదు. ఈ ఏడాది జూన్‌లో మరణం అంచుల వరకూ వెళ్లొచ్చాను. నాకు 8 సార్లు రక్తమార్పిడి చేశారు. దాదాపు 12 కిలోల బరువు, సగానికిపైగా రక్తాన్ని కోల్పోయాను. తిరిగి ఆరోగ్యంగా ఫైట్‌ చేయడం కోసం పోరాడాల్సి వచ్చింది. అయితే దీనిలో మాత్రం నేను విజయం సాధించాను. డల్లాస్‌లో ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి కౌబాయ్‌ స్టేడియంలో నా వయసులో సగం ఉన్న ఓ టాలెంటెడ్ యువకుడితో ఉత్సాహంగా మునివేళ్లపై కదులుతూ, నేను చేసిన 8 రౌండ్ల పోరాటాన్ని నా పిల్లలు చూశారు' అని పేర్కొన్నాడు.

మరోవైపు మ్యాచ్‌ విజేత జేక్ పాల్ కూడా స్పందించాడు. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. 'రికార్డులు బద్దలయ్యాయి. లవ్‌ యూ మైక్‌. నంబర్లు తప్పు చెప్పవు. త్వరలోనే ప్రకటన వెలువడుతుంది' జేక్ అని పేర్కొన్నాడు.

కాగా, మైక్ దాదాపు 19 ఏళ్ల తర్వాత రీసెంట్​గా ప్రొఫెషనల్‌ రింగ్‌లోకి అడుగు పెట్టాడు. ఈ మెగాఫైట్​లో 27ఏళ్ల యంగ్ ఫైటర్, యూ ట్యూబర్ జేక్ పాల్‌తో తలపడ్డాడు. అమెరికా AT&T స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్​ను ప్రత్యక్షంగా 72,300 మంది, టీవీల్లో ఆరు కోట్ల మంది వీక్షించారు. పరోక్షంగా సుమారు 6కోట్ల మంది ఆన్​లైన్, టీవీల్లో చూశారు. వ్యూవర్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చేసిన నెట్​ఫ్లిక్స్​ కూడా కాసేపు నిలిచిపోయింది. ఇక ఈ పోటీలో ముగ్గురు జడ్జీల్లో ఒకరు 80-72 స్కోరుతో మరో ఇద్దరు 79- 73తో పాల్‌ను విజేతగా నిర్ణయించారు.

మెగా ఫైట్​ - దిగ్గజ బాక్సర్​ మైక్ టైసన్​ను ఓడించిన పాల్​

మైక్ టైసన్ VS జేక్ పాల్ మెగా ఫైట్​కు వేళాయే - భారత్‌లో ఎక్కడ, ఎప్పుడు లైవ్‌ చూడొచ్చంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.